అమెరికాలో మళ్లీ మొదటి రోజులు.. భారీగా నమోదవుతున్న కేసులు

  • గత 24 గంటల్లో 67 వేలు దాటేసిన కొత్త కేసులు
  • వచ్చే నెలకి 1.50 లక్షల మరణాలు సంభవిస్తాయంటున్న అధ్యయనాలు 
  • ఇప్పటికే 1.36 లక్షల మంది బలి
కరోనా వైరస్‌ తొలినాటి రోజులు మళ్లీ అమెరికాలో కనిపిస్తున్నాయి. దేశంలో ఇటీవల కొంత తగ్గిన వైరస్ ఉద్ధృతి మళ్లీ మొదలైంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది కేసులు వెలుగు చూస్తుండగా, తాజాగా నిన్న 67,632 మంది వైరస్ బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి.

ఇక తాజా కేసులతో కలుపుకుని దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 36,16,747కు చేరుకుంది. అలాగే, 1,36,400 మందిని వైరస్ కబళించింది. దేశంలో ఇప్పటి వరకు 16,45,962 మంది మహమ్మారి కోరల నుంచి బయటపడగా, 18,30,645 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, వచ్చే నెల నాటికి యూఎస్‌లో మరణాల సంఖ్య 1.50 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్న తాజా అధ్యయనాలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.


More Telugu News