సైన్యానికి మరిన్ని అధికారాలు.. రూ. 300 కోట్ల వరకు ఆయుధాలను కొనుగోలు చేసేందుకు అనుమతి!

  • సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయాలు
  • రాజ్ నాథ్ నేతృత్వంలో నేడు డీఏసీ సమావేశం
  • అత్యవసర ఆయుధాలను కొనుగోలు చేసే అధికారం సైన్యానికి అప్పగింత
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. సైన్యానికి సొంతంగా నిర్ణయాలను తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. తాజాగా రూ. 300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది.

దీంతో, ఇకపై రూ. 300 కోట్ల వరకు జరిపే కొనుగోళ్లకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈరోజు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యవసరమైన ఆయుధాలను కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది. సైన్యాన్ని మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News