వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లిపోవచ్చు: రాహుల్ గాంధీ
- ఒడిదుడుకుల్లో రాజస్థాన్ కాంగ్రెస్
- పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్
- ఇప్పటికే అన్ని పదవుల నుంచి తొలగించిన పార్టీ
కాంగ్రెస్ పార్టీ నుంచి సచిన్ పైలట్ వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఓటమి కోసం పని చేసిన తాను ఆ పార్టీలోకి ఎలా వెళ్తానని ఆయన ప్రశ్నించినప్పటికీ... ఆయన కాంగ్రెస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జరగబోయే పరిణామాలను సూచిస్తున్నట్టుగా ఉన్నాయి.
విద్యార్థి విభాగం నాయకులతో ఈరోజు రాహుల్ మాట్లాడుతూ, పార్టీలో ఉండేవాళ్లు ఉండొచ్చని, వెళ్లిపోవాలనుకుంటున్నవాళ్లు వెళ్లిపోవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రాహుల్ తో సచిన్ కు మంచి అనుబంధమే ఉంది. అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా సచిన్ వ్యవహరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, సచిన్ కాంగ్రెస్ ను వీడటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలపై రేపు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.