భారత వ్యతిరేక వ్యాఖ్యలు.. స్వదేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని ఓలీ
- రాముడు నేపాల్ లో పుట్టాడని వ్యాఖ్యానించిన నేపాల్ ప్రధాని
- విమర్శలు గుప్పించిన నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా
- సంబంధాలను నాశనం చేయాలనుకుంటున్నారని వ్యాఖ్య
భారత్ కు ఇబ్బంది కలిగించేలా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేస్తున్న వ్యాఖ్యలపై సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాదని... రాముడు నేపాల్ లో జన్మించాడని, సీతామాతది కూడా నేపాలే అంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా మాట్లాడుతూ, ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఇప్పటికే ఓలీ తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీన పడ్డాయని ఆయన మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను నాశనం చేయాలని ఓలీ చూస్తున్నట్టుందని అన్నారు.
నేపాల్ ప్రధాన వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్ ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ఓలీ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య, నాయకుల మధ్య, ప్రజల మధ్య సంబంధాలు తెగిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్టు కథనంలో పేర్కొంది. చైనా ప్రోద్బలంతో ఓలీ ఇటీవల వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.