రిలయన్స్ జియోతో ఒప్పందంపై సుందర్ పిచాయ్ స్పందన

  • ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి
  • రిలయన్స్ లో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నాం
  • మాకు చాలా గర్వంగా ఉంది
రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్ లో గూగుల్ సంస్థ రూ. 33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడితో గూగుల్ దాదాపు 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనుందని చెప్పారు. జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.  

ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పిచాయ్ చెప్పారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ లో తొలి విడతగా రిలయన్స్ లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని... ఇది తమకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో భాగస్వాములం కావడం గొప్పగా ఉందని అన్నారు.


More Telugu News