ప్రతి ప్రమాద ఘటన వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉంది: బుద్ధా వెంకన్న
- విశాఖను జగన్ చేతుల్లో పెట్టేందుకు విజయసాయి యత్నిస్తున్నారు
- కరోనా సమయంలో రాంకీ సంస్థకు అనుమతులు ఎవరిచ్చారు?
- వైసీపీది అసమర్థ పాలన
విశాఖను ముఖ్యమంత్రి జగన్ చేతుల్లో పెట్టడానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న అన్నారు. విశాఖ ప్రజలు ఒకవైపు కరోనాకు, మరోవైపు విజయసాయిరెడ్డికి భయపడుతున్నారని చెప్పారు. విశాఖలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాల వెనుక విజయసాయి హస్తం ఉందని ఆరోపించారు. కరోనా సమయంలో రాంకీ సంస్థకు అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే పరవాడ ప్రమాద మృతుల కుటుంబాలకు కూడా రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాంకీ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇంతవరకు విచారణ కమిటీని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని... దీన్నించి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.