పాక్ విమానాలకు తన గగనతలాన్ని నిషేధించిన ఒమన్

  • పీఐఏ పైలట్లలోని మూడో వంతు మంది దగ్గర నకిలీ సర్టిఫికెట్లు
  • ఆందోళన వ్యక్తం చేసిన ఒమన్ పౌర విమానయాన శాఖ
  • తమ గగనతలం వాడుకోవద్దంటూ పాక్ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు
పాకిస్థాన్ విమానాల రాకపోకలపై ఒమన్ నిషేధం విధించింది. తమ గగనతలాన్ని పాక్ విమానాలు వాడుకోకుండా అడ్డుకట్ట వేసింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)లో పనిచేస్తున్న పలువురు పైలట్లకు నకిలీ డిగ్రీలు ఉన్నట్టు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఒమన్ పౌరవిమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత పీఐఏలోని పైలట్లలో దాదాపు మూడోవంతు మంది వద్ద ఉన్న డిగ్రీలు నకిలీవని తేలడం అప్పట్లో సంచలనమైంది. పీఐఏతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయమై ఒమన్ పౌరవిమానయాన శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా, ఆ దేశ విమానాలపై నిషేధం విధించింది.


More Telugu News