ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం

  • వెలగపూడిలోని సచివాలయంలో భేటీ
  • నేటి భేటీ అజెండాలో మొత్తం 22 అంశాలు
  • కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై చర్చ
  • గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై చర్చ
ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్‌ సమావేశమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతోన్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నేటి భేటీ అజెండాలో మొత్తం 22 అంశాలను చేర్చింది. వీటిపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇసుక కొరతను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నారు.

అలాగే, రాయలసీమ కరవు నివారణకు ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక అంశంపై చర్చించే అవకాశం ఉంది.


More Telugu News