చైనా వ్యాక్సిన్ సిద్ధం... తొలుత జవాన్లకు పంపాలని జిన్ పింగ్ సర్కారు ఆదేశాలు!
- కాన్సినో బయోలాజిక్స్ వ్యాక్సిన్ కు అనుమతి
- క్లినికల్ ట్రయల్స్ విజయవంతం
- అడినో వైరస్ ఆధారంగా వ్యాక్సిన్ తయారీ
చైనాలో కరోనా వ్యాక్సిన్ సిద్ధం కాగా, తొలుత సైనిక అవసరాలకు వినియోగించాలని జిన్ పింగ్ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాన్సినో బయోలాజిక్స్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పురోగతిపై ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పరిమితంగా సైనిక అవసరాలకు తొలుత అందించాలని సంస్థకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
'ఏడీ5-ఎన్ సీఓవీ' పేరిట దీన్ని అడినో వైరస్ ఆధారంగా తయారు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండబోవని రెండు నెలల క్రితమే తేలింది. ఆపై ఇది మానవ శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారు కావడానికి దోహదపడుతోందని తేలడంతోనే దీన్ని ఆమోదించిన ప్రభుత్వం, జవాన్లకు పంపాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సివుంది.