నిండిపోయిన జూరాల... శ్రీశైలానికి పెరుగుతున్న నీరు!
- జలాశయంలోకి 45 వేల క్యూసెక్కుల నీరు
- దిగువకు 27 వేల క్యూసెక్కుల విడుదల
- 157 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో నదిలోకి నీరు వస్తోంది. ప్రస్తుతం జలాశయంలోకి 45 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ నీరు శ్రీశైలానికి వస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.214 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.200 మీటర్ల ఎత్తునకు నీరుంది. ఎగువ జూరాల హైడల్ ప్రాజెక్టులో 3 యూనిట్ల నుంచి 117 మెగావాట్ల విద్యుత్ ను, దిగువ జూరాల విద్యుత్ కేంద్రం నుంచి ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.