బ్లాక్ మార్కెట్లో కరోనా మందులు... గుట్టురట్టు చేసిన హైదరాబాదు పోలీసులు
- రూ.4,500 విలువైన ఇంజెక్షన్ రూ.40 వేలకు విక్రయం
- ఎనిమిది మంది అరెస్ట్
- రూ.35 లక్షల విలువైన ఔషధాల స్వాధీనం
కరోనా కష్టకాలంలోనూ అవినీతి భూతం కోరలు చాచి విజృంభిస్తోంది. కొవిడ్ రోగులకు అందించాల్సిన ప్రాణాధార మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న విషయం బట్టబయలైంది. పోలీసులు ఈ మెడికల్ రాకెట్ గుట్టురట్టు చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో హైదరాబాద్ పాతబస్తీలో దాడులు చేసి అంతర్రాష్ట్ర బ్లాక్ మార్కెట్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.35 లక్షల విలువైన అత్యంత కీలకమైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ మందుల్లో అత్యధికంగా ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్), స్డాండర్డ్ క్యూకోవిడ్-19 ఎల్జీఎం, రెమ్ డెసివిర్ వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. రూ.4,500 విలువైన ఇంజెక్షన్ ను ఈ ముఠా రూ.40 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. రూ.10 వేల విలువైన ఔషధాలను రూ.50 వేలకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా ఉన్నాయి.
ఈ ముఠాకు వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడని, మెడికల్ రిప్రజంటేటివ్స్ ద్వారా ఈ కరోనా ఔషధాలను మార్కెట్లోకి పంపిస్తున్నారని, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో బ్లాక్ మార్కెటింగ్ కు సహకరించవద్దని మెడికల్ డిస్ట్రిబ్యూటర్లకు, డీలర్లకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.