కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి శ్రీశైలం ఆలయంలో దర్శనాల నిలిపివేత!
- ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్
- వారం రోజుల పాటు దర్శనాలు బంద్
- యథాతథంగా కొనసాగనున్న నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు
ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. వారం రోజుల పాటు దర్శనాలు ఉండవని ఆలయ అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, తాజాగా ఆలయానికి చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు పరిచారికలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ అనుమతితో ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపి వేస్తున్నట్టు ఈవో ప్రకటించారు. స్వామివారు, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఈవో తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ అనుమతితో ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపి వేస్తున్నట్టు ఈవో ప్రకటించారు. స్వామివారు, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఈవో తెలిపారు.