ముంబై ట్రాఫిక్ కు ఈ వాహనాలే కరెక్ట్: ఆనంద్ మహీంద్రా
- డిఫెన్స్ కోసం ప్రత్యేక వాహనాలను తయారు చేసిన మహీంద్రా సంస్థ
- మందు పాత్రల నిర్మూలన కోసం తయారైన వాహనాలు
- ఫొటోలను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఇండియాలో బెంగళూరు తర్వాత అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే నగరం ముంబై. ఎప్పుడు చూసినా రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. ముంబైలో ప్రయాణాలకు చాలా సమయం పడుతుంటుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు. తన సంస్థ రక్షణరంగం కోసం చేసిన ప్రత్యేక వాహనం యొక్క ఫొటోలను షేర్ చేశారు. సైనికులు సురక్షితంగా ఉండేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. ముంబై ట్రాఫిక్ లో నడిపేందుకు అనువుగా ఉంటాయని చలోక్తి విసిరారు.
మందు పాతరలను వెలికి తీసేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యం ఈ వాహనాలను వినియోగించనుంది. ఈ వాహనాల గురించి ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు.
మందు పాతరలను వెలికి తీసేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యం ఈ వాహనాలను వినియోగించనుంది. ఈ వాహనాల గురించి ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు.