హోం ఐసోలేషన్ లో ఉంటున్న కరోనా పాజిటివ్ వ్యక్తులకు తెలంగాణలో టెలి మెడిసిన్ సేవలు
- లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తులకు హోం ఐసోలేషన్
- ఉచితంగా టెలి మెడిసిన్ సేవలు అందిస్తామని ఈటల వెల్లడి
- ప్రత్యేక నెంబర్ ను ట్వీట్ చేసిన ఈటల
కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చి లక్షణాలు లేని వ్యక్తులకు ఇంట్లోనే హోం ఐసోలేషన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారి కోసం టెలి మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సోకి హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం టెలి మెడిసిన్ విధానం ద్వారా సేవలు అందిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
ఇది పూర్తిగా ఉచితం అని, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పాజిటివ్ వ్యక్తులు ఏవైనా సందేహాలు వస్తే 1800 599 4455 నెంబర్ కు ఫోన్ చేయాలని ఈటల ట్విట్టర్ లో తెలిపారు. అంతేకాదు, హోం ఐసోలేషన్ కోరుకునేవారు 1800 599 12345 కాల్ సెంటర్ నెంబర్ కు ఫోన్ చేయాలంటూ ఈటల ట్వీట్ చేశారు.