అనంత పద్మనాభస్వామి ఆలయ వ్యవహారంలో సుప్రీం తీర్పు ఇక్కడ వైసీపీ సర్కారుకు కనువిప్పు కావాలి: చంద్రబాబు
- ట్రావెన్ కోర్ ఆలయ హక్కులపై సుప్రీం కీలక తీర్పు
- ఈ తీర్పును ఏపీ సర్కారు గమనించాలని చంద్రబాబు సూచన
- ట్రస్టుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దంటూ సీఎంకు హితవు
కేరళలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలన హక్కులను ట్రావెన్ కోర్ రాజ కుటుంబ వారసులకే అప్పగిస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఈ తీర్పు ఏపీలో వైసీపీ సర్కారుకు కనువిప్పు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ట్రస్టులను నిర్వహించే రాజకుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తున్న సంప్రదాయాలను, వివిధ ఒప్పందాల పవిత్రతను సుప్రీం కోర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొన్నారు.
ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా గమనించాలని, తమ చెడు లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఆపేయాలని హితవు పలికారు. ఈ ట్రస్టు సంరక్షులుగా గజపతి కుటుంబీకుల హక్కులను తప్పనిసరిగా రక్షించాలని ట్వీట్ చేశారు. చెత్త రాజకీయాలు చేసే క్రమంలో సీఎం జగన్ దేవుడికి సంబంధించిన ట్రస్టులను నడిపే కుటుంబాల వ్యవహారాల్లో కలుగజేసుకోరాదని పేర్కొన్నారు.