విశాఖలోని ఫార్మా కంపెనీ పేలుడుపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి గౌతం రెడ్డి.. మెరుగైన వైద్య సేవలకు ఆదేశం!
- కలెక్టర్‌ను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి
- బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- ఆందోళనకు దిగిన సీఐటీయూ నేత సత్యనారాయణ అరెస్ట్
విశాఖపట్టణం, పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో గత రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంపై మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. కలెక్టర్ వినయ్‌చంద్‌ను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గాజువాకలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కాగా, కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని, కార్మికుల హక్కులు పరిరక్షించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కంపెనీ ఎదుట సీఐటీయూ నేత సత్యనారాయణ ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.