కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తిస్తోంది.. 48 కేసులు వెలుగు చూశాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • కాంగో నదీ తీర ప్రాంతాల్లో ప్రబలుతున్న ఎబోలా వైరస్
  • గత రెండేళ్లలో 2200 మందికి పైగా మృత్యువాత
  • హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ
కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి నిజమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. కాంగో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సరిహద్దుల్లో కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇప్పటి వరకు 48 మంది ఈ వైరస్ బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర నిపుణుడు మైక్ ర్యాన్ తెలిపారు.

ఈ నెల మొదటి నుంచే వైరస్ వ్యాప్తి మొదలై చురుగ్గా వ్యాపిస్తోందని, దీని బారినపడి 20 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ పీడిస్తోంది. ఇప్పుడు ఎబోలా కూడా కాంగో నదీ తీరాల్లో వ్యాపిస్తుండడంతో హెచ్చరికలు జారీ చేసినట్టు ర్యాన్ తెలిపారు. కాగా, ఈ వైరస్ కారణంగా గత రెండేళ్లలో 2,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వైరస్‌పై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరింది.


More Telugu News