నోరు పారేసుకోవడం విపక్ష నేతలకు సరికాదు... మేం కూడా నోరు పారేసుకోగలం: కేటీఆర్

  • అసత్యప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • కష్టకాలంలో విమర్శలేంటన్న కేటీఆర్
  • కరోనాకు ఎవరూ అతీతులు కాదని పునరుద్ఘాటన
ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోగలిగామని, ఐదు కాలేజీల్లో కలిపి 1000 బెడ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులు తిరస్కరించినా, రోగులకు అండగా నిలిచింది ప్రభుత్వాసుపత్రులేనని అన్నారు. కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కరోనా బాధితులను వెలివేయడం మంచిది కాదని హితవు పలికారు.

ప్రభుత్వ చర్యలపై నోరు పారేసుకోవడం విపక్ష నేతలకు సరికాదు.. మేం కూడా నోరుపారేసుకోగలం అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయడంలేదనే మాట అర్థరహితమని విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రజారోగ్యమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో ఉన్నా గానీ, 98 శాతం మంది రోగులు కోలుకున్నారని చెప్పారు.


More Telugu News