మీరు పూర్తి చేస్తారనేది చంద్రబాబు 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టా? లేక మీ మంత్రి చెప్పిన 20 శాతం ప్రాజెక్టా?: దేవినేని ఉమ
- పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది
- 22 మంది ఎంపీలను పెట్టుకుని ఢిల్లీ నుంచి ఆ నిధులను తెచ్చారా?
- పోలవరం నిర్వాసితుల విషయంలో మాట తప్పారు, మడమ తిప్పారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శలు కురిపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని... 22 మంది ఎంపీలను పెట్టుకుని ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ నిధులను ఢిల్లీ నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. మీరు పూర్తి చేస్తారనేది చంద్రబాబు 70 శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టా? లేక మీ మంత్రి చెప్పిన 20 శాతం ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు రూ. 10 లక్షల నష్టపరిహారం ఇస్తామని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు రూ. 6 లక్షలు అంటూ మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శించారు.
'షాపింగ్ మాల్ కట్టకుండా రూ. 65 లక్షల గోల్‌మాల్, అదనపు లిఫ్ట్ ఛాంబర్ల పేరిట రూ. 2.22 కోట్లు, ఫుట్‌పాత్ నిర్మాణంలో అవకతవకలు, తాజాగా మరో రూ. 3 కోట్ల అక్రమాలు, దుర్గమ్మ నిధుల దుర్వినియోగం, కోట్ల రూపాయల శివయ్య స్థలం స్వాహా చేస్తున్న మీ నాయకుల అవినీతిపై, అధికారులపై చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పండి జగన్ గారూ' అని దేవినేని ప్రశ్నించారు.