ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి విధించే క్వారంటైన్ లో మార్పులు
- ఏపీలో తాజా మార్గదర్శకాలు జారీ
- హైరిస్క్ జోన్లుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు
- రైళ్లలో రాష్ట్రానికి వచ్చేవారికి 14 రోజుల హోం క్వారంటైన్
ఏపీలో నూతన కరోనా మార్గదర్శకాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి విధించే క్వారంటైన్ లో మార్పులు చేశారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చేవారికి ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి అని నిర్దేశించారు.
హైరిస్క్ జోన్లుగా ప్రకటించిన తెలంగాణ, కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా 14 రోజుల హోంక్వారంటైన్ అమలు చేస్తారు. ఇప్పటివరకు ఈ తరహా క్వారంటైన్ 7 రోజులుగా ఉంది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశారు. ఇక, విదేశాల నుంచి వచ్చేవారికి ఇకపై 7 రోజుల పాటు క్వారంటైన్ విధించనున్నారు. వారికి ఎయిర్ పోర్టుల్లోనే స్వాబ్ టెస్టు చేయాలని, క్వారంటైన్ లో ఐదో రోజు, ఏడో రోజు కరోనా టెస్టులు చేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.