మరోసారి చొరవ చూపిన తెలంగాణ గవర్నర్... మరిన్ని వెంటిలేటర్లు పంపాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి

  • ఈఎస్ఐకి టెస్టింగ్ కిట్లు కోరిన తమిళిసై
  • రోజుకు 3 వేల టెస్టులు చేసే యంత్రాన్ని ఇస్తామన్న కేంద్రమంత్రి
  • కృతజ్ఞతలు తెలిపిన తమిళిసై
ఇటీవలే తెలంగాణ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమై కరోనా చికిత్సలు, బిల్లులు తదితర అంశాలపై చర్చించి, ప్రజలకు మరిన్ని సేవలు అందేలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంతో చొరవ ప్రదర్శించారు. తాజాగా ఆమె మరోసారి తెలంగాణ ప్రజల కోసం స్పందించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతమవుతుండడంతో మరిన్ని వెంటిలేటర్లు కావాలంటూ కేంద్రాన్ని కోరారు.

ఈ క్రమంలో ఆమె కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ తో మాట్లాడారు. ఈఎస్ఐకి మరిన్ని వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు కావాలని అడిగారు. తమిళిసై విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. అంతేకాదు, రోజుకు 3 వేల టెస్టులు చేసే యంత్రాన్ని కూడా తెలంగాణకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో తమిళిసై కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News