కరోనా రికవరీలో టాప్ 10 రాష్ట్రాలు ఇవే... అడ్రస్ లేని తెలుగు రాష్ట్రాలు!

  • 63.02 శాతానికి పెరిగిన దేశ రికవరీ రేటు
  • 85.45 శాతం రికవరీ రేటుతో తొలి స్థానంలో లడఖ్ 
  • 2.64కు తగ్గిన మరణాల రేటు
మన దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. ఈరోజుతో రికవరీ రేటు 63.02 శాతానికి పెరిగింది. మన దేశ సరాసరి రికవరీ రేటు కంటే 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. రికవరీ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 10 జాబితాలో కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ తొలి స్థానంలో ఉంది. టాప్ టెన్ జాబితాలో ఇరు తెలుగు రాష్ట్రాలు స్థానాన్ని దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఈరోజుతో దేశ వ్యాప్తంగా మొత్తం 5,53,470 మంది కరోనా పేషెంట్లు రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 18,850 మంది కోలుకున్నారు.

కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 10 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల జాబితా:

  • లడఖ్ - 85.45%
  • ఢిల్లీ - 79.98%  
  • ఉత్తరాఖండ్ - 78.77%
  • ఛత్తీస్ గఢ్ - 77.68%
  • హిమాచల్ ప్రదేశ్ - 76.59%
  • హర్యాణా - 75.25%
  • ఛండీగఢ్ - 74.60%
  • రాజస్థాన్ - 74.22%
  • మధ్యప్రదేశ్ - 73.03%
  • గుజరాత్ - 69.73%

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,19,103 మంది శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. మరోవైపు మరణాల శాతం కూడా తగ్గుముఖం పట్టింది. మరణాల రేటు ప్రస్తుతం 2.64 శాతానికి తగ్గింది. దేశ సరాసరి మరణ రేటు కంటే 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రేటు తక్కువగా ఉంది. వీటిలో మణిపూర్, నాగాలాండ్, దాద్రా మరియు నాగర్ హవేలి, డమన్ మరియు డయూ ఉన్నాయి.


More Telugu News