యాక్టర్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువ: బిపాసా బసు
- యూనిట్ లో అందరూ రక్షణ కవచాలను ధరిస్తారు
- యాక్టర్లు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా నటించాలి
- అందుకే యాక్టర్లకు కరోనా ఎక్కువగా సోకుతోంది
కరోనా మహమ్మారి బారిన పలువురు నటీనటులు పడుతుండటం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నటి బిపాసా బసు ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు యాక్టర్లకు ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపింది.
యూనిట్ లోని ఇతరులందరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులను ధరిస్తారని... అయితే యాక్టర్లు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా నటించాల్సి ఉంటుందని చెప్పింది. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమని తెలిపింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరింది.