నష్టాల్లోకి జారుకుని.. చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 99 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 35 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • టెక్ మహీంద్రా, రిలయన్స్ తదితర కంపెనీలకు లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్రాడేలో హయ్యెస్ట్ పాయింట్ నుంచి దాదాపు 490 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది.

తర్వాత మార్కెట్లు వెంటనే పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లలో నిస్తేజంగా ట్రేడింగ్ జరిగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 36,694కి పెరిగింది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకుని 10,802 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (5.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.80%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.97%), భారతి ఎయిర్ టెల్ (2.10%), ఇన్ఫోసిస్ (1.77%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.41%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.26%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.00%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.66%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.65%).


More Telugu News