తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు.. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా

  • తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేత
  • హైకోర్టులో పిటిషన్
  • ఇప్పటికే స్టే ఇచ్చిన న్యాయస్థానం
  • ఈ నెల 15 వరకు స్టే పొడిగిస్తున్నట్టు తాజా ఆదేశాలు
తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పటికే ఓసారి స్టే ఇచ్చిన హైకోర్టు, ఇప్పుడా స్టేను పొడిగిస్తున్నట్టు తాజా విచారణలో వెల్లడించింది. ఈ నెల 15 వరకు స్టే అమల్లో ఉంటుందని వివరించింది. అప్పటివరకు విచారణ వాయిదా వేసింది.

క్యాబినెట్ భేటీ ప్రతిని సమర్పించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు పేర్కొంది. క్యాబినెట్ భేటీకి సంబంధించి కనీసం ప్రెస్ నోట్ కూడా సమర్పించకపోతే ఎలా విచారించాలని అసంతృప్తి వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేతపై జూన్ 30న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ తెలిపిన సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్ జనరల్ క్యాబినెట్ భేటీ ప్రతిని ఈ సాయంత్రం లోపు సమర్పిస్తామని కోర్టుకు విన్నవించారు.


More Telugu News