'ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి?' అంటూ వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు

  • ఏపీలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిస్థితులు ఘోరం
  • క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన
  • అభద్రతా భావం పెంచేలా ఉన్నాయి
  • సదుపాయాలు కల్పించడం లేదు
ఏపీలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వీడియోను పోస్ట్ చేశారు. 'తమకేదయినా ఆపద వస్తే ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలి. కానీ, రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెంచేలా ఉన్నాయి. ఇంత ఖర్చుపెడుతున్నాం, అంత ఖర్చుపెడుతున్నాం అంటూ పాలకులు లెక్కలు చెబుతున్నారు' అని అన్నారు.
 
'అలాంటప్పుడు పరిస్థితులు ఎందుకింత దారుణంగా ఉంటున్నాయి?  పేషంట్ల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి? అక్షయ లాంటి సంస్థలతో కలిసి అన్న క్యాంటీన్ లను ఎంతో ఘనంగా నిర్వహించాం. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించండి' అని చెప్పారు.

ఈ సందర్భంగా ఓ క్వారంటైన్‌ కేంద్రంలో రోగుల బాధలను వివరిస్తూ పలువురు బాధితులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. తమ ఇబ్బందుల గురించి క్వారంటైన్‌ సిబ్బంది పట్టించుకోవట్లేదని బాధితులు పలువురు అక్కడి అధికారులను నిలదీస్తుండడం ఇందులో కనపడుతోంది. అక్కడ ఎలాంటి సదుపాయాలూ కల్పించడం లేదని విమర్శించారు.


More Telugu News