కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా: ముద్రగడ బహిరంగ లేఖ
- సామాజిక మాధ్యమాల్లో నాపై విమర్శలు చేస్తున్నారు
- నన్ను కుల ద్రోహి, గజదొంగ అంటున్నారు
- ఉద్యమం ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయా
- మేధావులతో కలిసి ఉద్యమం నడిపాను
కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన తెలిపారు. తనను కుల ద్రోహి, గజదొంగ వంటి వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన వాపోయారు.
కాపు ఉద్యమం ద్వారా తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని ముద్రగడ తెలిపారు. మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని చెప్పారు. తాను రోజుకో మాట మాట్లాడుతున్నానంటూ విమర్శిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం బాధేస్తోందని తెలిపారు. సందర్భానుసారంగా ఉద్యమం రూపురేఖలు మార్చుకుంటోందని, తన జాతికి ఏదో విధంగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు.