చైనాలో పురుగుల నుంచి కొత్త వ్యాధి... థర్మోబాక్టోపినియా సిండ్రోం!

  • ఇప్పటికే ఐదుగురి మృతి
  • 23 మందికి చికిత్స
  • వెల్లడించిన 'గ్లోబల్ టైమ్స్'
చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి, ఇప్పటికే ప్రపంచాన్ని కుదేలు చేసి, ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉండగా, ఇప్పుడు మరో కొత్త వ్యాధి తెరపైకి వచ్చింది. దీని పేరు థర్మోబాక్టోపినియా సిండ్రోం. ఇది పురుగుల నుంచి వ్యాపిస్తోంది. ఏప్రిల్ 23 నుంచి బద్దె పురుగు వంటి పురుగులు కుడితే ఈ వ్యాధి వస్తోందని, ఇవి కుట్టిన తరువాత బాధితుడు విపరీతమైన జ్వరంతో క్రమంగా అనారోగ్యం పాలవుతున్నాడని, ఇప్పటివరకూ ఐదుగురు మరణించారని, అన్హుయ్ ప్రావిన్స్ లో ఈ వ్యాధి విస్తరిస్తోందని చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకి 23 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


More Telugu News