కరోనా బారినపడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, భార్య, కుమార్తె!

  • కడపలో నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికీ కరోనా పాజిటివ్
  • శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్విమ్స్‌లో చేరిక
  • చికిత్స అనంతరం నిన్న హైదరాబాద్ ఆసుపత్రికి  
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా బారినపడ్డారు. కడప జిల్లాలో ఆయన కుటుంబానికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో డిప్యూటీ సీఎంతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కరోనా నిర్ధారణ కావడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో తిరుపతిలోని కొవిడ్ ఆసుపత్రి (స్విమ్స్)లో చేరారు. వీరి ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిన్న వీరు స్విమ్స్ నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్టు వైద్యాధికారులు తెలిపారు.


More Telugu News