ఏడాదిలోనే జగన్మాయ నుంచి జనం బయటపడ్డారు: యనమల

  • జగన్ తొలి ఏడాది పాలన అంతా వాత, కోత, రోత 
  • మాయ పథకాలతో పేదలను జగన్ వంచించారు 
  • వైసీపీ పాలనతో రాష్ట్రంలో పేదరికం, అసమానతలు పెరిగాయి
  • రూ.18,026 కోట్ల లబ్ధిని పేదలకు దూరం చేశారు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో సీఎం జగన్ తొలి ఏడాది పాలన అంతా వాత, కోత, రోతగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలతో పేదలను జగన్ వంచించారని ఆయన ఆరోపించారు.

గత ఐదేళ్ల కాలంలో టీడీపీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్ తెచ్చింది మాయ పథకాలేనని యనమల రామకృష్ణుడు అన్నారు. మాయ పథకాలతో జగన్ వంచించారని, ఏడాదిలోనే జగన్మాయ నుంచి జనం బయటపడ్డారని ఆయన అన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో పేదరికం, అసమానతలు పెరిగాయని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాల రద్దుతో రూ.18,026 కోట్ల లబ్ధిని పేదలకు దూరం చేశారని యనమల తెలిపారు. 


More Telugu News