ముంబై జైల్లో తీవ్ర ఆనారోగ్యంతో విప్లవ కవి వరవరరావు!

  • విచారణ ఖైదీగా ఉన్న వరవరరావు
  • ఆయన ప్రాణాలను కాపాడండి
  • కేసీఆర్ కు హేమలత విజ్ఞప్తి
ప్రస్తుతం విచారణ ఖైదీగా మహారాష్ట్రలోని ముంబై, తలోజ జైల్లో ఉన్న విప్లవకవి వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించి, ప్రాణాలు కాపాడాలని ఆయన సహచరి హేమలత వెల్లడించారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వెంటనే స్పందించి, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. జైలు అధికారులు వరవరరావుతో తనకు ఫోన్ చేయించారని, ఆయన పొంతన లేకుండా మొద్దుబారిపోయినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసిన హేమలత, వరవరరావుతో పాటు ఉన్న వ్యక్తి, అదే ఫోన్ లో తనతో మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం ఎంతమాత్రమూ బాగాలేదని వెల్లడించినట్టు తెలిపారు.

కాగా, వరవరరావు ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్ కు నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ఓ లేఖను రాశారు. ఆయన్ను వెంటనే బెయిల్ పై విడుదల చేసి, కుటుంబ సభ్యులతో ఉండే ఏర్పాటు చేయాలని, ఆయనకు సరైన చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.


More Telugu News