తొలిసారిగా మాస్క్ ను ధరించిన డొనాల్డ్ ట్రంప్!
- కరోనా సోకి చికిత్స పొందుతున్న సైనికులు
- పరామర్శించేందుకు వచ్చిన ట్రంప్
- మాస్క్ ధరిస్తే సౌకర్యవంతంగా ఉందని వ్యాఖ్య
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించడం ప్రారంభించి ఆరు నెలలకు పైగా గడిచిన తరువాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ ధరించి కనిపించారు. తాను మాస్క్ ను ధరించనే ధరించబోనని గతంలో ప్రకటించిన ఆయన, ఇంతవరకూ మాస్క్ ధరించి కనిపించలేదు. తాజాగా, ఓ ఆసుపత్రిలో కరోనా సోకి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన, ఓ ముదురు రంగు మాస్క్ తో కనిపించారు. ఆయనతో పాటు వచ్చిన వారంతా మాస్క్ లను ధరించారు.
ఇక మాస్క్ విషయమై ట్రంప్ ను మీడియా ప్రశ్నించగా, హాస్పిటల్ లో మాస్క్ ధరించడం ఎంతో మంచిదని, సైనికులను పరామర్శిస్తున్న వేళ, తనకు సౌకర్యంగా అనిపించిందని అన్నారు. మాస్క్ లను ధరించడాన్ని తానేమీ వ్యతిరేకించలేదని, అయితే, అందుకు సమయం, సందర్భం ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. కాగా, కరోనా కేసుల విషయంలో అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. దేశంలో ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఇప్పటివరకూ 1.34 లక్షల మందికి పైగా కన్నుమూశారు.