కజకిస్థాన్ లో ప్రబలుతున్న వైరస్ కరోనా అయ్యుంటుంది: డబ్ల్యూహెచ్ఓ

  • కజక్ లో భయంకరమైన వైరస్ అంటూ చైనా వ్యాఖ్యలు
  • కరోనా కంటే ప్రమాదకరమైందని వెల్లడి
  • కొట్టిపారేసిన కజక్ వర్గాలు
  • కజకిస్థాన్ లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్ఓ బృందం
కజకిస్థాన్ లో కరోనా కంటే భయంకరమైన మరో వైరస్ విజృంభిస్తోందని, వెయ్యి మందికి పైగా ఈ గుర్తు తెలియని వైరస్ తో మరణించారని చైనా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆపై, ఈ ఆరోపణలను కజకిస్థాన్ కొట్టిపారేసింది. తాజాగా ఈ వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కజకిస్థాన్ లో న్యూమోనియా కలిగిస్తున్న ఆ వైరస్ బహుశా కరోనాయే అయ్యుంటుందని తెలిపింది.

ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ బృందం ఒకటి కజకిస్థాన్ లో పర్యటిస్తోంది. కరోనా వ్యాధి లక్షణాల్లో న్యూమోనియా కూడా ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు. చాలావరకు న్యూమోనియా కేసులను పరీక్ష చేస్తే కరోనా వెల్లడైందని, అయితే కజకిస్థాన్ లో కరోనా టెస్టులు సరిగా చేస్తుండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కజకిస్థాన్ లో కరోనా పరీక్షల నాణ్యతను పరిశీలిస్తామని, పరీక్ష ఫలితాలు ఎలా వస్తున్నాయో తెలుసుకుంటామని వివరించారు.


More Telugu News