తాప్సీ నటిస్తున్న చిత్రానికి 'కొవిడ్' బీమా!
- తాప్సీ కథానాయికగా 'లూప్ లపేటా'
- ఎవరికైనా పాజిటివ్ వస్తే నిర్మాతకు భారీ నష్టం
- కొవిడ్ ఇన్సూరెన్స్ గల తొలి సినిమా
ప్రతి ఒక్కర్నీ కరోనా అన్నది ఎంతగా భయపెడుతోందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళితే.. ఏ రూపంలో వచ్చి ఈ వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు అందరిలోనూ నెలకొన్నాయి. అందుకే సాధారణంగా ఎవరూ బయటకు అడుగుపెట్టడం లేదు. ఇక సినిమా తారలైతే చెప్పేక్కర్లేదు. నిర్మాతలు షూటింగులకు ప్లాన్ చేద్దామన్నా 'మేము రామంటే, మేము రామంటూ' చెప్పేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయి నిర్మాతలు చాలామంది కోట్లలో నష్టపోతున్నారు. ఇప్పుడు ఒకవేళ షూటింగులు ప్రారంభించాక సెట్లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చి షూటింగ్ ఆగిపోతే.. అది మళ్లీ మరింత నష్టం!
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాప్సీ కథానాయికగా 'లూప్ లపేటా'అనే హిందీ చిత్రాన్ని నిర్మిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు అతుల్ కాస్బేకర్, తనూజ్ గార్బ్ కాస్త భిన్నంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే, యూనిట్ మొత్తానికి కొవిడ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. షూటింగ్ మొదలెట్టాక ఎవరికైనా పాజిటివ్ వస్తే, మిగతా వాళ్లు కూడా క్వారంటైన్ కి వెళ్లాల్సి వుంటుంది. దీంతో నిర్మాతకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది. దీనిని ఆలోచించే కొవిడ్ బీమా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.
'ఈ విషయంలో మా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. ఇన్నాళ్లూ సినిమాలకు కూడా ఇన్సూరెన్స్ అనేది వుంది కానీ, కరోనా అన్నది కొత్తగా రావడం వల్ల దీనికి ప్రత్యేకంగా పాలసీ తీసుకోవలసి వస్తోంది' అని చెప్పారు. ఆ విధంగా తాప్సీ నటిస్తున్న చిత్రమే ఇండియాలో తొలి కొవిడ్ బీమా గల చిత్రమవుతుంది.