కరోనా క్వారంటైన్ కిట్ ను ఇంటికే పంపిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • హోం క్వారంటైన్ లో ఉన్నవారికి కిట్ల పంపిణీ
  • కిట్ లో మందులు,శానిటైజర్, ఆక్సీమీటర్, మాస్కులు
  • కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలింపు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా... వారికి కావాల్సినవాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా హోమ్ క్వారంటైన్ కిట్ ను పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఈ కిట్ ను అందిస్తారు.

లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే... ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది.


More Telugu News