మరీ ఘోరంగా కేవలం నెల రోజులకి రూ.49 జీతం ఇస్తారా?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • సచివాలయం కూల్చేసి కొత్తది కట్టడానికే ధనిక రాష్ట్రమా?  
  • ఆర్టీసీ కార్మికులకు మాత్రం జీతంలో కోత పెడ్తారా?
  • కనీస వేతన చట్టం అంటూ ఒకటి ఉంది తెలుసునా?
తెలంగాణ సర్కారుపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 'సచివాలయం కూల్చేసి కొత్తది కట్టడానికే తెలంగాణ ధనిక రాష్ట్రమా? ఆర్టీసీ కార్మికులకు మాత్రం జీతంలో కోత పెడ్తారా? మరీ ఘోరంగా కేవలం 49 రూపాయలు ఇస్తారా? కనీస వేతన చట్టం అంటూ ఒకటి ఉంది తెలుసునా?' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

'ఓ ఆర్టీసీ డ్రైవర్ నెల జీతం రూ. 49' అంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ ఆయన ఆ ట్వీట్ చేశారు. విధులకు వచ్చి రిపోర్టు చేసినా చాలా మందికి గైర్హాజరు వేశారనీ, భారీ మొత్తంలో జీతాలు కట్‌ చేశారనీ, ఈఎస్ఐ, పీఎఫ్‌ కటింగ్‌లు అన్నీ పోనూ సంగారెడ్డి డిపోకు చెందిన ఓ డ్రైవర్‌కు రూ.49 జీతం అందిందని ఆ వార్తలో పేర్కొన్నారు. చాలా మందికి  రూ.100 లోపే జీతం వచ్చిందని అందులో ఉటంకించారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ సర్కారుపై మండిపడ్డారు.  


More Telugu News