ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి
- ఇప్పటివరకు మొత్తం 1,26,25,000 మందికి కరోనా
- మొత్తం 5,62,820 మంది మృతి
- కోలుకున్న వారి సంఖ్య 73,61,659
- నిన్న అమెరికాలో 68,000కు పైగా కొత్త కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,26,25,000 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 5,62,820 మంది ప్రాణాలు కోల్పోగా, కోలుకున్న వారి సంఖ్య 73,61,659 ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
అమెరికాలో గత మూడు రోజులుగా 65,000 కంటే ఎక్కువగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒకేరోజులో అమెరికాలో 68,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,91,786కు చేరగా, 1,36,671 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 849 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 14,60,495 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 16,94,620 మందికి చికిత్స అందుతోంది.
అమెరికా తర్వాత బ్రెజిల్లో అత్యధికంగా 18,04,338 మందికి కరోనా సోకింది. రష్యాలో మొత్తం 7,13,936 కేసులు నమోదు కాగా, పెరులో 3,19,646 నమోదయ్యాయి. చిలీలో 3,09,274 మందికి కరోనా సోకగా, స్పెయిన్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,00,988, యూకేలో 2,88,133, ఇరాన్లో 252,720కి చేరింది.