నదిలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలను తాళ్ల సాయంతో కాపాడిన సిబ్బంది.. వీడియో ఇదిగో
- అరుణాచల్ ప్రదేశ్‌లో ఘటన
- ఆ రాష్ట్రంలో భారీగా వర్షాలు
- విరిగిపడుతోన్న కొండచరియలు
- ఇప్పటివరకు ఓ చిన్నారి సహా మొత్తం 8 మంది మృతి
నదిలో కొట్టుకుపోతోన్న దంపతులను సహాయక బృందాలు తాళ్ల సాయంతో బయటకు తీసిన ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌లో చోటు చేసుకుంది. భారీగా కురుస్తోన్న వర్షాలకు సిబో కొరొంగ్ నదికి వరద పోటెత్తింది. దీంతో ప్రమాదవశాత్తూ అందులో పడి దంపతులు కొట్టుకుపోతోన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు తూర్పు సియాంగ్ జిల్లా విపత్తు నిర్వహణ బృందానికి సమాచారం అందించడంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని దంపతులను రక్షించారు.
ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులకు వరద నీరు పోటెత్తుతోంది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు ఓ చిన్నారి సహా మొత్తం 8 మంది మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.