ఇద్దరూ నష్టపోతారు: భారత్-చైనాలకు దలైలామా హెచ్చరిక

  • రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి
  • పక్క దేశానికి నష్టం చేయాలని ఎవరూ ప్రయత్నించవద్దు
  • ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండాలి
భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవని... కయ్యానికి కాలుదువ్వుకోవద్దని హితవు పలికారు. పక్క దేశానికి నష్టం చేకూర్చాలని ఏ ఒక్క దేశం ప్రయత్నించినా... రెండు దేశాలు నష్టపోతాయని హెచ్చరించారు. ప్రపంచంలోనే ఈ రెండు దేశాలు అత్యంత పురాతనమైనవని, పురాతన చారిత్రక మూలాలను కలిగి ఉన్నాయని చెప్పారు. ఒక్కో దేశంలోనూ 100 కోట్లకు పైగా జనాభా ఉందని అన్నారు. ఇరు దేశాల మధ్య ఏదైనా పోటీ ఉంటే అది ఆరోగ్యకరంగానే ఉండాలని చెప్పారు.

శాంతికి చిహ్నమైన బౌద్ధానికి చైనా చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉందని... అలాంటి బౌద్ధానికి గురువైన బుద్ధుడి జన్మస్థలం భారత్ అని దలైలామా తెలిపారు. అందుకే ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ, ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండాలని హితవు పలికారు. 2011 నుంచి దలైలామా పాలనాపరమైన అంశాలపై వ్యాఖ్యానించలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై స్పందించారు.


More Telugu News