'నెల్లూరులో జేసీబీ సాయంతో కరోనా మృతుల ఖననం'పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!
- మృతదేహాలను గుంతలోకి విసిరేసిన జేసీబీ
- వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు
- విచారణాధికారిగా నెల్లూరు ఆర్డీవో నియామకం
నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల మృతదేహాలను ఓ జేసీబీ సాయంతో సామూహికంగా పూడ్చివేస్తున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. పీపీఈ కిట్లు ధరించిన కొందరు వ్యక్తులు పెన్నా నది పక్కనే జేసీబీ తవ్విన గుంతలో ముగ్గురు కరోనా మృతులను ఖననం చేసేందుకు ప్రయత్నించడం ఆ వీడియోలో కనిపించింది. మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా జేసీబీ ఉపయోగించి ఆ మృతదేహాలను గుంతలో పడేలా విసిరేశారంటూ దీనిపై విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ను ప్రత్యేక అధికారిగా నియమించారని, ఆయన ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, అమానవీయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.