కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
- పిటిషన్ దాఖలు చేసిన తీన్మార్ మల్లన్న
- అత్యవసరంగా విచారించలేమన్న హైకోర్టు
- హెబియస్ కార్పస్ దాఖలు చేసుకోవాలని సూచన
కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ నవీన్ (తీన్మార్ మల్లన్న) ఈ పిటిషన్ వేశారు. గత కొంత కాలంగా కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయని, నిజాలు తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారని పిటిషన్ లో తెలిపారు. సీఎం ఆరోగ్యం ఎలా ఉందో ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. పిటిషన్ ను అత్యవసరంగా స్వీకరించాలని కోరారు.
ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ గిమ్మిక్కులు చేయవద్దని హెచ్చరించింది. పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమని తెలిపింది. సీఎం కనిపించకపోవడంతో హెబియస్ కార్పస్ దాఖలు చేసుకోవాలని సూచించింది.