సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్‌

  • కొవిడ్ నిబంధనలను పట్టించుకోవడం లేదని హైకోర్టులో పిటిషన్
  • వాతావరణం కాలుష్యమవుతోందని అభ్యంతరం
  • సోమవారం వరకు కూల్చివేతలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. కూల్చివేత పనులను నిలిపివేయాలంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. భవనాల కూల్చివేతతో వాతావరణం కాలుష్యమవుతోందని చెప్పారు. మున్సిపల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, సెక్రటేరియట్ కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.


More Telugu News