750 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
- ప్రత్యామ్నాయ విద్యుత్ గా సౌరశక్తి
- ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు రేవా ప్రాజెక్టు నుంచి విద్యుత్
- నిర్మాణం జరుపుకుంటున్న మరికొన్ని ప్రాజెక్టులు
జల, థర్మల్ విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ప్రపంచం దృష్టి సౌరశక్తిపై పడింది. భారత్ లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, రేవాలోనీ ఈ సోలార్ ప్లాంట్ ఇక్కడి పరిశ్రమలకు విద్యుత్ అందించడమే కాకుండా, ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. రేవా మాత్రమే కాకుండా, షాజాపూర్, నీముచ్, ఛత్తర్ పూర్ లోనూ సౌరవిద్యుత్ కేంద్రాలు నిర్మాణం జరుపుకుంటున్నాయని వివరించారు.