ఎనిమిది సార్లు పైడితల్లి శిరిమానును అలంకరించిన అమ్మవారి ప్రధానార్చకుడు భాస్కరరావు కన్నుమూత!
- దశాబ్దాలుగా అమ్మవారిని సేవిస్తున్న భాస్కరరావు
- చివరి చూపుకోసం పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలు
- సంతాపం తెలిపిన ప్రముఖులు, నేతలు
విజయనగరం జిల్లా ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు తాళ్లపూడి భాస్కరరావు ఈ ఉదయం కన్నుమూశారు. వంశపారంపర్యంగా వచ్చిన అవకాశంతో ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారిని సేవించుకుంటున్న ఆయన, ఇప్పటివరకూ ఎనిమిది సార్లు సిరిమానును అధిరోహించారు. సాక్షాత్తు అమ్మవారికి ప్రతిరూపంగా భాస్కరరావును భక్తులు భావిస్తుంటారు. భాస్కరరావు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న భక్తులు పెద్దఎత్తున ఆయన నివాసానికి తరలిరావడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అనారోగ్య కారణాలతోనే ఆయన మరణించారని తెలుస్తోంది. భాస్కరరావు మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.