బ్లాక్ మార్కెట్‌లోకి రెమిడెసివిర్.. సామాన్యులకు అందని ధర!

  • కరోనా రోగుల ప్రాణాలతో అక్రమార్కుల చెలగాటం
  • నల్ల బజారులో రూ. 15 వేల నుంచి రూ. 35 వేలకు పెరిగిన ధర
  • అధీకృత డీలర్ల వద్ద కనిపించని ఔషధ నిల్వలు
కరోనా చికిత్సలో అత్యవసరంగా ఉపయోగించే రెమి‌డెసివిర్ ఔషధం ఇప్పుడు అక్రమార్కుల చేతుల్లో చిక్కి నల్లబజారుకు చేరుకుంది. ఫలితంగా ఔషధం అందుబాటులోకి వచ్చిందని నిబ్బరంగా ఉన్న కరోనా రోగులకు ఆ సంతోషం దూరమవుతోంది. బాధితుల ప్రాణాలను తమ జేబులు నింపుకునే ముడిసరుకుగా ఉపయోగించుకుని ఔషధం ధరను వేలకు వేలు పెంచేసి విక్రయిస్తున్నారు.

బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని ధర కూడా పెరుగుతూ పోతుండడం గమనార్హం. ఢిల్లీ బ్లాక్ మార్కెట్లో నిన్న మొన్నటి వరకు దీని ధర రూ. 15 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ. 35 వేలకు చేరుకోవడం చూస్తుంటే అక్రమార్కులు ఎలా చెలరేగిపోతున్నదీ అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని బ్లాక్ మార్కెట్లో రెమి‌డెసివిర్ అందుబాటులో ఉన్నా.. అధీకృత డీలర్ల వద్ద మాత్రం లేకపోవడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


More Telugu News