చైనా అండతో రెచ్చిపోతున్న నేపాల్.. భారతీయ టీవీ చానళ్ల బంద్!

  • భారత టీవీ చానళ్లను ఆపేస్తున్నట్టు ప్రకటించిన నేపాల్ కేబుల్ ఆపరేటర్లు
  • స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నామని ప్రకటన
  • అధికార పార్టీ నేత ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిర్ణయం
చైనా ప్రోద్బలంతో నేపాల్ రొమ్ము విరిచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత భూభాగాలను తమ మ్యాప్ లో చూపించుకుంది. భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా మన దేశ టీవీ చానళ్లను ఆపేస్తున్నట్టు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. కేవలం దూరదర్శన్ ను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. తమ నిర్ణయం వెనుక నేపాల్ ప్రభుత్వం లేదని... తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీనిపై నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ... జరుగుతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిషేధించాలని ఆ దేశ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ ఈ ఉదయం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత చానళ్లను ఆపేశారు.


More Telugu News