ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అందరూ పాస్!

  • 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
  • జూలై 31 తర్వాత మార్కుల మెమోల అందజేత
  • సీఎం నిర్ణయంతో పరీక్షలను రద్దు చేశామన్న సబిత
కరోనా కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం తీవ్రంగా ప్రభావితమైంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మినహా మిగిలిన పరీక్షలన్నీ రద్దైపోయాయి. తాజాగా టీఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు పరీక్షలను రద్దు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేస్తున్నామని చెప్పారు. 2020లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు తెలిపారు.

వీరంతా కంపార్ట్ మెంట్ లో ఉత్తీర్ణులైనట్టు మార్కుల జాబితాలో పేర్కొంటామని సబిత ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జూలై 31 తర్వాత సంబంధిత కాలేజీల నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెమోలను 10 రోజుల తర్వాత అందిస్తామని చెప్పారు.


More Telugu News