హృతిక్ రోషన్ 'క్రిష్ 4'.. అప్ డేట్ గా వస్తున్న జాదూ!

  • 'క్రిష్' సీరీస్ లో నాలుగో సినిమా 
  • టైం ట్రావెల్ పాయింట్ తో సాగే కథ
  • జనవరి నుంచి షూటింగ్ మొదలు    
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలకు సీక్వెల్స్ నిర్మిస్తుండడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. బాలీవుడ్ లో కూడా ఈ తరహా సినిమాలు వస్తుంటాయి. అదే కోవలో ఇప్పుడు హృతిక్ రోషన్ హీరోగా 'క్రిష్ 4' చిత్రం రానుంది.

గతంలో హృతిక్ కథానాయకుడుగా వచ్చిన 'కోయి.. మిల్ గయా', 'క్రిష్', 'క్రిష్ 3' సీరీస్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దాంతో 'క్రిష్ 4' నిర్మించాలని హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్ గతంలోనే నిర్ణయించాడు. అసలు మొదట్లో అనుకున్న ప్రకారమైతే, ఈ ఏడాది క్రిస్ మస్ కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే, రాకేష్ రోషన్ కేన్సర్ కి గురికావడంతో చికిత్సకు వెళ్లడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడాయన పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టారు.

ఇక ఈ 'క్రిష్ 4' టైం ట్రావెల్ (కాలంలోకి ప్రయాణించడం) అనే స్టోరీ లైన్ తో రూపొందుతోందని తెలుస్తోంది. గతంలో 'కోయి.. మిల్ గయా'లో అందర్నీ ఆకట్టుకున్న క్రిష్ మిత్రుడు జాదూ క్యారెక్టర్ మరింత అప్ డేట్ తో వస్తోందట. జాదూ సాయంతో క్రిష్ భూత కాలంలోకి ప్రయాణించి, మరణించిన తన తండ్రిని వెనక్కు తెచ్చే సాహస కార్యాలతో  ఈ చిత్రం సాగుతుందట.

ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ అవకాశం ఉండడంతో ఆ వర్క్ కోసం షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని రెడ్ చిల్లీస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.జనవరి నుంచి సెట్స్ కి వెళ్లే ఈ చిత్రంలో హృతిక్ సరసన దీపిక పదుకొనే కథానాయికగా నటించే అవకాశం వుంది.


More Telugu News