తిరుమల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన.. అంతలోనే పొరపాటు జరిగిందన్న జిల్లా కలెక్టర్!

  • టీటీడీ సిబ్బందిలో 80 మందికి కరోనా
  • తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రకటన
  • గంట వ్యవధిలోనే మరో లిస్ట్ విడుదల చేసిన వైనం
టీటీడీలో పని చేస్తున్న సిబ్బందిలో 80 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో, తిరుమలను కంటైన్మెంట్ జోన్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అయితే పొరపాటున తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామంటూ జిల్లా కలెక్టర్ మరో లిస్ట్ ను విడుదల చేశారు. తాజా ప్రకటనతో శ్రీవారి భక్తులకు ఆటంకం తొలగిపోయింది.

తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే మరో ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా తిరుమలకు రావచ్చని చెప్పారు. ప్రస్తుతానికి రోజుకు 10 వేల మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News