రండి.. పెట్టుబడులు పెట్టండి.. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా వచ్చాయి: మోదీ

  • భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది
  • పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం
  • విజ్ఞానానికి భారత్ అధికార కేంద్రం
కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. 'ఇండియా గ్లోబల్ వీక్ 2020'ని పురస్కరించుకుని ఆయన ప్రసంగిస్తూ... ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మాత్రమే తాము ఇస్తున్న సదుపాయాలని ఇస్తున్నాయని తెలిపారు. అంతరిక్షంలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఇప్పుడు వచ్చాయని చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో భారత్ పాత్ర చాలా ప్రధానమైనదని మోదీ అన్నారు. భారత్ కు చెందిన టెక్కీలు కొన్ని దశాబ్దాలుగా ప్రపంచానికి దారి చూపిస్తున్నారని చెప్పారు. విజ్ఞానానికి భారత్ అధికార కేంద్రమని తెలిపారు. ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు. ఆర్థిక, సాంఘిక సవాళ్లను అధిగమించిన చరిత్ర తమకుందని తెలిపారు. ప్రస్తుతం కరోనాతో పోరాడుతూనే, ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నామని చెప్పారు.


More Telugu News